

భారత్–శ్రీలంక మహిళల మధ్య ఐదో టీ20 మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఇప్పటికే జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన టీమ్ ఇండియా సిరీస్‌ను పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో షెఫాలి వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ అద్భుత ఫామ్‌లో ఉండటంతో భారత జట్టు మరింత బలంగా కనిపిస్తోంది. ఈ స్టార్ బ్యాటర్లను అడ్డుకోవడం శ్రీలంకకు పెద్ద సవాలుగా మారింది.
మరోవైపు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన శ్రీలంక, కనీసం చివరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగుదల చూపితేనే భారత్‌కు పోటీ ఇవ్వగల పరిస్థితి. ఈ హోరాహోరీ పోరు రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అభిమానులు ఉత్కంఠతో మ్యాచ్‌ను వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!