
.webp&w=3840&q=75)
విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు సులభమైన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసిన భారత్, శ్రీలంకను 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులకే పరిమితం చేసింది. ఓపెనర్ గుణరత్నే 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. హాసిని పెరీరా (20), హర్షిత (21), కెప్టెన్ చమరి ఆటపట్టు (15) కొంతమేర స్కోర్‌ను ముందుకు నడిపించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, శ్రీచరణి తలో వికెట్ తీశారు.
122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు కేవలం 14.4 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జెమీమా రోడ్రిగ్స్ అద్భుతంగా ఆడి 69 పరుగులతో అజేయంగా నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. షెఫాలీ వర్మ (9), స్మృతి మంధాన (25) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. ఈ విజయంతో తొలి మ్యాచ్‌లోనే భారత్, శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!