

సోషల్ మీడియా సెన్సేషన్ కుమారి ఆంటీ ఇటీవల ‘పాంచాలి పంచభర్తృక’ సినిమాతో నటిగా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం సుమారు ఏడు నుంచి ఎనిమిది సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ నిర్వహిస్తూ “మీది మొత్తం రూ.1000 అయింది.. రెండు లివర్స్ ఎక్స్‌ట్రా” అనే డైలాగ్‌తో ఆమె సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తన హోటల్‌లో రోజుకు సుమారు రూ.20 వేల వరకు కౌంటర్ సేల్ ఉంటుందని, అందుకు తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయని చెప్పారు.
తన గతాన్ని గుర్తుచేసుకున్న కుమారి ఆంటీ.. హైదరాబాద్‌కు రాకముందు గ్రామంలో కుట్టు పని చేయడంతో పాటు వ్యవసాయ పనులు కూడా చేసేవారని తెలిపారు. భర్తతో కలిసి 2011లో హైదరాబాద్ వచ్చి ఫుడ్ బిజినెస్ ప్రారంభించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ఫేమస్ కాకముందే తన హోటల్‌కు పెద్ద సంఖ్యలో కస్టమర్లు వచ్చేవారని, పలువురు సినీ ప్రముఖులు కూడా అక్కడికి వచ్చేవారని వెల్లడించారు. గతేడాది బిగ్‌బాస్ షో నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, అయితే అప్పట్లో వెళ్లలేకపోయానని తెలిపారు. ఈసారి అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోనని కుమారి ఆంటీ చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!