
విడుదల తేదీ: నవంబర్ 21, 2025
నటీనటులు: అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి ,సౌమ్య జాను తదితరులు
దర్శకుడు: నాని కాసరగడ్డ
రచన:డాక్టర్ అనిల్ విశ్వనాథ్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కుశేందర్ రమేష్ రెడ్డి
ఎడిటింగ్: నాని కాసరగడ్డ
అల్లరి నరేష్ – కామాక్షి భాస్కర్ల జంటగా వచ్చిన 12ఏ రైల్వే కాలనీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో నిర్మించబడింది. సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.
అనాధ అయిన కార్తిక్ (అల్లరి నరేష్) లోకల్ లీడర్ టిల్లు అన్న (జీవన్ కుమార్) కోసం చిన్న పెద్ద పనులు చేస్తుంటాడు. పక్కింటి ఆరాధన (కామాక్షి)ను ఇష్టపడుతూ ఉంటాడు. కొన్ని సంఘటనలతో ఆరాధన కూడా తనను ఇష్టపడుతున్నట్లు కార్తిక్ గ్రహిస్తాడు. అయితే, టిల్లు అన్న చెప్పిన ఓ పని కోసం ఆరాధన ఇంట్లోకి దొంగచాటుగా వెళ్లిన కార్తిక్ అక్కడ షాకింగ్ సంఘటనను చూస్తాడు. ఆరాధన తల్లిని చంపింది ఎవరు? ఆ హత్యలకు కార్తిక్‌కు సంబంధం ఏమిటి? ఈ మర్డర్ మిస్టరీ ఎలా బయటపడుతుందన్నదే కథ.
రొమాన్స్, క్రైమ్, హారర్ ఎలిమెంట్స్‌ను భాగాలవారీగా కలిపిన తీరు కొంతవరకు కనెక్ట్ అవుతుంది.
ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది, కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ థ్రిల్లింగ్‌గా ఉన్నాయి.
అల్లరి నరేష్ రెండు షేడ్స్‌తో నటించి తన పాత్రకు న్యాయం చేశాడు.
సాయి కుమార్, కామాక్షి భాస్కర్ల నటనలు బాగా తీశారు.
వైవా హర్ష, గెటప్ శ్రీను తదితరుల నటన సరైన స్థాయిలో ఉంది.
భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సినిమా కి చాలా ప్లస్ అయ్యింది
కథ ఆసక్తికరమైనప్పటికీ, ప్రదర్శన స్లోగా సాగుతుంది.
ఫస్ట్ హాఫ్‌లో బోర్ కొట్టించే సీన్స్, అనవసర ల్యాగ్లు ఎక్కువ.
భావోద్వేగ సన్నివేశాలు సహజంగా అనిపించవు.
ప్రేమ సన్నివేశాలు కొన్ని చోట్ల కనెక్ట్ కావు.
హత్యల చుట్టూ ఉన్న ఉత్కంఠను మరింత బలంగా చూపించాల్సింది.
డాక్టర్ అనిల్ విశ్వనాథ్ రాసుకున్న కాన్సెప్ట్ మంచి స్కోప్ ఉన్నా, స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉంది. సినిమాటోగ్రఫీ థ్రిల్లింగ్ ఎపిసోడ్లను సహజంగా చూపించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సగటుగా ఉంది. ఎడిటింగ్ మరింత టైట్‌గా ఉంటే సినిమా పేస్ బాగుండేది. నిర్మాణ విలువలు మంచివే.
12ఏ రైల్వే కాలనీ క్రైమ్ థ్రిల్లర్‌గా కొన్ని సన్నివేశాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే పేస్ స్లోగా ఉండడం, కథా నిర్మాణంలో బలం లేకపోవడం, ప్రేమ–భావోద్వేగ ఎలిమెంట్లు పూర్తిగా పని చేయకపోవడం చిత్రానికి మైనస్. కొన్ని మంచి సన్నివేశాలను తప్ప, సినిమా మొత్తంగా ఒక సాధారణ క్రైమ్ డ్రామాగా మాత్రమే అనిపిస్తుంది.
రేటింగ్: 2.25/5











కామెంట్స్ (1)
Seems fine.