

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కేవలం సరిహద్దుల సమస్య కాదని, ఇది ప్రపంచ భద్రతను ప్రభావితం చేసే స్థాయికి చేరిందన్నారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లు, ఆహార సరఫరా దెబ్బతింటున్నాయని తెలిపారు. అలాగే చైనా, ఇరాన్, నార్త్ కొరియా దేశాలు రష్యాకు మద్దతు ఇవ్వడం వల్ల ఇది అంతర్జాతీయ భద్రతా సంక్షోభంగా మారిందని అన్నారు.
కాల్పుల విరమణపై జెలెన్స్కీ స్పష్టంగా “నో” చెప్పారు. క్రిమియా, డాన్బాస్ ప్రాంతాలపై రష్యా నియంత్రణను అంగీకరించేది లేదన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ రష్యాకు బలం పెంచుకునే అవకాశం ఇస్తుందని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లక్ష్యం ఉక్రెయిన్‌తోనే ఆగదని, తన ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నాడని అన్నారు. అందుకే అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు అధునాతన రక్షణ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి క్షిపణులు, ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ఇదే సమయంలో రష్యా పాలక వ్యవస్థ జెలెన్స్కీ వ్యాఖ్యలను అతిశయోక్తిగా కొట్టిపారేసింది. అయినా యూరోప్ దేశాలు, నాటో వర్గాల్లో ఉక్రెయిన్‌కు అదనపు మద్దతుపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య, ఈ యుద్ధం రెండు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ రాజకీయ సమీకరణాలను మార్చే స్థాయికి చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు.













.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!