
క్రీడలు

కేరళం లో యూడీఎఫ్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీడీ సతీషన్ సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనుండగా, దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో ఒకేసారి పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడనుంది. మంత్రుల జాబితాను ఇప్పటికే గవర్నర్‌కు అందజేశారు.
సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గాన్ని ఎంపిక చేసినట్లు సతీషన్ తెలిపారు. కూటమి భాగస్వాములతో చర్చించిన తర్వాతే మంత్రి పదవుల కేటాయింపులు జరిగినట్లు వెల్లడించారు. ఐయూఎంఎల్ పార్టీకి ఐదు మంత్రి పదవులు కేటాయించారు. రమేష్ చెన్నితల, కే మురళీధరన్, సన్నీ జోసెఫ్ సహా పలువురు సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!