

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర ప్రచారం మొదలైంది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తరఫున చెన్నై నియోజకవర్గం నుంచి ప్రముఖ నటి త్రిష పోటీ చేసే అవకాశముందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు, రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా ఈ ప్రచారం తమిళ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
విజయ్‌తో కలిసి త్రిష కూడా రాజకీయ రంగంలోకి అడుగుపెడితే అది తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎంజీఆర్–జయలలిత జంట తమిళ రాజకీయాలను ప్రభావితం చేసినట్టే, విజయ్–త్రిష కాంబినేషన్ కూడా ప్రజల్లో ఆసక్తిని పెంచవచ్చని చర్చ జరుగుతోంది. అయితే త్రిష నిజంగా ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!