
సినిమాలు

ప్రముఖ నటుడు, జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి రావడంతో తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. ఆదివారం విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఆధిపత్యానికి తెరపడినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
విజయ్ సీఎం బాధ్యతలు చేపట్టిన వెంటనే తమిళనాడు సీఎంవో అధికారిక ఎక్స్ ఖాతా ప్రొఫైల్ ఫోటో, కవర్ ఇమేజ్ను అధికారులు మార్చారు. దీంతో అభిమానులు, నెటిజన్లు పెద్దఎత్తున సీఎంవో ఖాతాలను ట్యాగ్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం తమిళనాడు సీఎంవో ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్లో కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!