
రాజకీయాలు

తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్, ఎగ్జిట్ పోల్స్‌లో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహాబలిపురంలో ఒక రిసార్ట్‌ను బుక్ చేసి గెలిచిన అభ్యర్థులను ఒకేచోట ఉంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
ఫలితాలు వెలువడిన వెంటనే అభ్యర్థులు నేరుగా రిసార్ట్‌కు రావాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. కౌంటింగ్‌కు ఒకరోజు ముందే తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను మరింత పెంచింది.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!