
జనరల్

రైతులను తప్పుదారి పట్టిస్తూ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై కార్మిక, భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు చేశారు. చెన్నూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులను భయాందోళనకు గురి చేయడం సరికాదని అన్నారు. బాల్క సుమన్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని యువతను రెచ్చగొడుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం రైతుల నుంచి వచ్చిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, రైతులకు నష్టపరిహారం అందించిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలిపారు. బాల్క సుమన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!