
క్రీడలు

భారాస పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జులను ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఐటీ నిపుణుడిని నియమించి తెలంగాణ భవన్లో డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ శిక్షణ పొందినవారు జిల్లా పార్టీ కార్యాలయాల్లో ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్ఛార్జుల ఆధ్వర్యంలో మరింత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ప్రతి నియోజకవర్గంలోని బూత్‌ల సంఖ్యను బట్టి బూత్‌కు ఇద్దరికి చొప్పున వారం రోజుల పాటు శిక్షణ ఇస్తారు. డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తైన వెంటనే సభ్యత్వ నమోదు తేదీని ప్రకటిస్తారు. ఆ రోజున కేసీఆర్‌తో పాటు పార్టీ ముఖ్య నేతలు సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!