
రాజకీయాలు

రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు మేయర్, మూడు మున్సిపల్ చైర్మన్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. కాకినాడ మేయర్ అభ్యర్థిగా ఆకుల భవానిని పార్టీ ప్రకటించింది. పట్టణ స్థానిక సంస్థల్లో పార్టీ బలాన్ని పెంచుకునే దిశగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది.
మూడు మున్సిపల్ చైర్మన్ స్థానాలకు కూడా జనసేన అభ్యర్థులను ప్రకటించింది. రాజాం చైర్‌పర్సన్ అభ్యర్థిగా సౌజన్యలతను, భీమవరం చైర్‌పర్సన్ అభ్యర్థిగా మల్లేశ్వరిని ఎంపిక చేసింది. తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వెంకటేశ్వరరావు పేరును ఖరారు చేసింది. దీంతో మొత్తం ఐదు కీలక స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం, తదుపరి రాజకీయ కార్యాచరణపై పార్టీ దృష్టి సారించనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!