
జనరల్

కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థల్లో యూనిఫాం విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరిలో పాఠశాలల యూనిఫాంనకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ, కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు మరియు ప్రీ యూనివర్శిటీ కళాశాలల్లో విద్యార్థులు నిర్దేశిత యూనిఫాంను ధరించడంతో పాటు పరిమితంగా సంప్రదాయ, మతపరమైన చిహ్నాలను ధరించేందుకు అనుమతి ఇచ్చింది.
గతంలో అమలులో ఉన్న ఆదేశాలు రాష్ట్రంలో హిజాబ్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తాజా మార్గదర్శకాల ప్రకారం తలపాగా, జంధ్యం, శివదారం, రుద్రాక్ష, హిజాబ్ వంటి మతపరమైన చిహ్నాలకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇవి విద్యార్థుల క్రమశిక్షణ, భద్రత లేదా గుర్తింపుకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!