30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

Writer: Nithish 11:42 PM, 29 ఆగస్టు, 2026
ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమానికి తమ ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని సీఎం ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్‌ కె. కేశవరావు (కేకే) చైర్మన్‌గా ఏర్పాటైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ప్రతినిధి బృందం శనివారం సీఎంతో భేటీ అయింది. ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ఎం. కోదండరామ్‌, కమిటీ సభ్యులు మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములునాయక్‌ పాల్గొన్నారు. ఉద్యమకారులు, జేఏసీలు, ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు, మహిళా ఉద్యమకారులతో నిర్వహించిన సంప్రదింపుల సారాంశంతో పాటు వర్గీకరణ ముసాయిదాతో కూడిన నివేదికను కమిటీ సీఎంకు అందజేసింది.

నివేదికను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యమకారుల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం, వారి కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడం ప్రజా ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. 250 గజాల నివాస స్థలాలు, ఆసరా తరహా పెన్షన్లు, హెల్త్‌కార్డులు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యోగులకు గౌరవ గుర్తింపు వంటి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ పోర్టల్‌ ఏర్పాటు చేసి డిజిటల్‌ దరఖాస్తులు స్వీకరించాలని, జిల్లాల వారీగా సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

వైసీపీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో కొత్త పార్టీ

వైసీపీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో కొత్త పార్టీ

వైఎస్ జగన్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్...

వైఎస్ జగన్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్...

ట్యాగ్లు
తెలంగాణ ఉద్యమకారులురేవంత్‌రెడ్డితెలంగాణ ఉద్యమంఉద్యమకారుల సంక్షేమంఉద్యమకారుల గుర్తింపుకోదండరామ్‌కేశవరావుతెలంగాణ ప్రభుత్వంహెల్త్‌కార్డులుఆసరా పెన్షన్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు
జనరల్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ 2026 ఫలితాలు విడుదల
జనరల్

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ 2026 ఫలితాలు విడుదల

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు
జనరల్

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు
జనరల్

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు
జనరల్

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌
సినిమాలు

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌

మారథాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

మారథాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం
సినిమాలు

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట
జనరల్

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ
రాజకీయాలు

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!