
క్రీడలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, టీవీకే పార్టీ మరియు సీఎం విజయ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో స్పందించిన ఆయన, టీవీకే ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతోందని అన్నారు.
రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై వ్యాఖ్యానిస్తూ, గ్రౌండ్ ఫ్లోర్‌లో రాజీనామా చేసి ఫస్ట్ ఫ్లోర్‌లో కొత్త పార్టీ కండువా కప్పుకున్నారని పళనిస్వామి ఎద్దేవా చేశారు. సినిమా పాపులారిటీతో అధికారంలోకి వచ్చిన నాయకులకు చివరకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!