
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. యాడికిలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సాగునీటి సంఘాలు, రైతులతో సమావేశం అవుతారు. అలాగే హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా లాభపడుతున్న రైతులతో మాట్లాడి, కాలువ విస్తరణతో వచ్చే నీటి లభ్యతపై చర్చిస్తారు. రాష్ట్రంలో నీటి భద్రత, రిజర్వాయర్లలో నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితిపై కూడా సమీక్ష నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా వేములపాడులోని పెండేకల్లు జలాశయంను పరిశీలించనున్నారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో హాఫ్మూన్ సాగు పద్ధతిని పరిశీలిస్తారు. అనంతరం తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాగునీటి సంఘాలకు 100 రోజుల ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్న సీఎం, రాత్రికి అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!