
జనరల్

రాజకీయ కూటమిలో సమన్వయం అంశంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి తాను సంపూర్ణ సహకారం అందిస్తున్నానని, అలాగే అదే స్థాయి సహకారం తిరిగి ఆశిస్తున్నానని తెలిపారు. అవసరమైన సహకారం లభించకపోతే తన నిర్ణయం కఠినంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
మంగళగిరిలో జరిగిన జనసేన ఉధ్యమి ఆత్మీయ సమావేసంలో ఆయన కుల రాజకీయాలు, ప్రాంతీయ భావజాలంపై భావోద్వేగంగా మాట్లాడారు. ‘జై అమరావతి’ కంటే ‘జై ఆంధ్ర’ భావన పెద్దదని పేర్కొన్నారు. కుల విభజన వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఐక్యత కొరవడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!