
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేబినెట్ మంత్రులు, స్వతంత్ర శాఖల మంత్రులు, సహాయ మంత్రులు హాజరుకానున్నారు.
మోదీ 3.0 కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై జరుగుతున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. ప్రభుత్వ పథకాల అమలు, మంత్రిత్వ శాఖల పనితీరు సమీక్ష ఈ భేటీలో జరగనుంది. జూన్ 10న మోదీ 3.0 ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో జూన్ రెండవ వారంలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశముందన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!