

ఓటీటీలోకి తెలుగు బోల్డ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రం ప్రేమిస్తున్నా స్ట్రీమింగ్కు వచ్చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంతగానో అలరించిన సాత్విక్ వర్మ హీరోగా చేసిన ఈ మూవీలో ప్రీతి నేహా హీరోయిన్గా చేసింది. ఐఎమ్‌డీబీ నుంచి 9 రేటింగ్ అందుకున్న ప్రేమిస్తున్నా ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
సరికొత్త ప్రేమకథగా ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్‌లో విడుదలై మంచి మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకథగా వచ్చిన ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆహాలో ప్రేమిస్తున్నా డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. నిన్న అంటే నవంబర్ 28 నుంచి ఆహాలో ప్రేమిస్తున్నా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్‌లో మిస్ అయిన ఆడియెన్స్ ప్రేమిస్తున్నా మూవీనీ ఆహా ఓటీటీలో ఎంచక్కా వీక్షించవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!