

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’. విజయవంతమైన ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటించగా.. ఎస్.జే. సూర్య, రజిషా విజయన్ కీలక పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. థియేట్రికల్ రన్ పూర్తికాకముందే కేవలం 20 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
‘సర్దార్ 2’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అక్టోబర్ 1 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక ప్రకటన వీడియోను కూడా విడుదల చేశారు. థియేటర్లలో సినిమా మిస్ అయిన కార్తి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!