
న్యూస్

దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయిన తాజా సినిమాలు ఇప్పుడు ఓటిటి ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, సిద్ధూ జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా ఈ నెల 7న, ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన డ్యూడ్ ఈ నెల 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక రవితేజ తాజా చిత్రం మాస్ జాతర ఓటిటి హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్ రన్ పూర్తయిన నెల రోజుల్లోనే ఈ సినిమా స్ట్రీమింగ్కి వచ్చే అవకాశముంది.
నెట్‌ఫ్లిక్స్ నవంబర్‌లో తెలుగు బ్లాక్బస్టర్ల బలమైన లైనప్‌తో ఆధిపత్యం చెలాయించేలా కనిపిస్తోంది!








.avif&w=3840&q=75)


కామెంట్స్ (1)
Can’t wait for this festive OTT lineup!