
న్యూస్

హీరో రవితేజ సినిమాలైతే చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడట్లేదు. ఈ నెల ప్రారంభంలోనే 'మాస్ జాతర' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గతంలో 'ధమాకా'తో హిట్ కొట్టడంతో ఇందులోనూ శ్రీలీలనే హీరోయిన్గా పెట్టుకున్నారు. కానీ కాంబో ఈసారి పనిచేయలేదు. థియేటర్లలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైంది.
ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. రవితేజ, శ్రీలీల కాంబోలో వచ్చిన 'మాస్ జాతర' చిత్రాన్ని కమర్షియల్ అంశాలతో తీశారు. కానీ కంటెంట్ మరీ బలహీనంగా ఉండటంతో థియేటర్లలో తొలి ఆట నుంచే ఈ మూవీ తేలిపోయింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మరో మాస్ సినిమా లేకపోవడంతో జనాలు కాస్తోకూస్తో చూసేందుకు వచ్చారు.
విడుదలకు ముందే డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా డీల్ సెట్ చేసుకున్నారు.అలా ఈ శుక్రవారం అంటే నవంబరు 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి 'మాస్ జాతర' రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!