

దళపతి విజయ్ నటించిన భారీ చిత్రం ‘జననాయగన్’ విడుదలకు ముందే అనేక సమస్యల్లో చిక్కుకుంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ వివాదాల కారణంగా వాయిదా పడింది. ఇదే సమయంలో సినిమా క్లిప్స్‌తో పాటు పూర్తి సినిమా ఆన్లైన్లో లీక్ కావడం చిత్ర బృందాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేకపోవడంతో సినిమాపై ఉన్న ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో థియేట్రికల్, డిజిటల్ వ్యాపారాలపై కూడా ప్రభావం పడుతున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ ఒప్పందంపై కూడా కొత్త చర్చ మొదలైంది. భారీ మొత్తానికి డిజిటల్ హక్కులు తీసుకున్న సంస్థ ఇప్పుడు ఒప్పందం నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మరో ఓటీటీ సంస్థ తక్కువ మొత్తంతో ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం ఖరారైతే నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా భవిష్యత్తుపై పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!