
ఓటీటీ

ఇండియన్ ర్యాప్ మ్యూజిక్, క్రైమ్ డ్రామా కలయికలో తెరకెక్కిన ‘లుక్కే’ సిరీస్ ఓటీటీలో భారీ స్పందన దక్కించుకుంటోంది. ఈనెల 8 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్ కొద్ది రోజుల్లోనే టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకుంది. అండర్‌గ్రౌండ్ మ్యూజిక్, మాఫియా ప్రపంచం నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ ర్యాపర్ కింగ్ నటుడిగా పరిచయమైన ఈ సిరీస్‌లో రాశీ ఖన్నా కీలక పాత్రలో కనిపించింది.
మురికివాడల్లో జీవించే యువ కళాకారుల పోరాటాన్ని సహజంగా చూపించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. వేగవంతమైన కథనం, రియలిస్టిక్ ర్యాప్ సాంగ్స్, స్ట్రీట్ స్టైల్ మేకింగ్ ఈ సిరీస్‌కు ప్రధాన బలాలుగా నిలిచాయి. తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉండటంతో తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘లుక్కే’పై భారీ చర్చ నడుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!