

జూన్ మూడో వారంలో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే వంటి ప్రముఖ స్ట్రీమింగ్ వేదికలు విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. థ్రిల్లర్లు, కామెడీలు, ఫ్యామిలీ డ్రామాలు, క్రైమ్ కథలు ఇలా అన్ని రకాల కంటెంట్ ఈ వారం అందుబాటులోకి రానుంది.
మోహన్‌లాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 జూన్ 18 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సేవ్ ది టైగర్స్ 3 జూన్ 19 నుంచి జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుండగా, టోవినో థామస్ నటించిన యాక్షన్ కామెడీ అతిరడి అదే రోజు సోనీలివ్‌లో అందుబాటులోకి రానుంది. అదనంగా కెనాథ కానోమ్, తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2, ఎం4ఎం: మోటివ్ ఫర్ మర్డర్ వంటి ఆసక్తికరమైన కంటెంట్ కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!