

ప్రైమ్ వీడియోలో విడుదలైన తాజా తమిళ్ ఒరిజినల్ సిరీస్ ‘ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్పోజ్డ్’ ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, పేపర్ లీకేజీలు, పరీక్షల స్కామ్‌లను ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన ఈ సోషియో-థ్రిల్లర్ మే 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. పరీక్షల కోసం కష్టపడే విద్యార్థులు, వారి కుటుంబాలు ఎదుర్కొనే ఒత్తిడి, అక్రమాల వల్ల కలిగే నష్టాలను సిరీస్‌లో ఇంటెన్స్‌గా చూపించినట్లు తెలుస్తోంది.
హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. విద్యా వ్యవస్థలోని లోపాలు, అక్రమాలకు పాల్పడే ముఠాల గుట్టును థ్రిల్లింగ్‌గా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నటీనటుల సహజ నటన, ఇంటెన్స్ స్క్రీన్‌ప్లే ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా మారాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సిరీస్‌పై పాజిటివ్ టాక్ పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!