
క్రీడలు

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ ‘రాఖ్’ సిద్ధమవుతోంది. ‘మీర్జాపూర్’ ఫేమ్ బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్‌గా నిర్మించింది. ఈ సిరీస్ జూన్ 12 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుండగా, విడుదలకు ముందుగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
విడుదలైన ట్రైలర్లో మిస్టరీ, క్రైమ్, సస్పెన్స్ అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. క్లిష్టమైన కేసును ఛేదించే పాత్రలో అలీ ఫజల్ ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. అనూహ్య మలుపులు, ఉత్కంఠభరిత దర్యాప్తు సన్నివేశాలతో రూపొందిన ‘రాఖ్’ ఈ నెలలో అత్యంత ఆసక్తికరమైన ఓటీటీ విడుదలల్లో ఒకటిగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!