

చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వారం థియేటర్లలో కొన్ని పెద్ద సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. బాలీవుడ్ నుంచి దురంధర్-2, టాలీవుడ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే దురంధర్ మొదటి భాగం మంచి విజయాన్ని సాధించడంతో సీక్వెల్‌పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై టాలీవుడ్లో కొంత బజ్ ఉన్నప్పటికీ, పెద్ద స్థాయిలో అంచనాలు మాత్రం కనిపించడం లేదు.
అదే సమయంలో ఈ వారం ఓటీటీల్లో కూడా అనేక సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. టాలీవుడ్ నుంచి సీతా పయనం మరియు జటాధర సినిమాలు స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి. జటాధర ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉండగా, ఇప్పుడు జీ5లో కూడా విడుదల కానుంది. అలాగే బోర్డర్-2 హిందీ సినిమా కూడా ఈ వారం ఓటీటీలోకి రానుంది. వీటితో పాటు చిరైయా, ల్యాండ్ లార్డ్ వంటి డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ వారం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో విడుదల కానున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు ఇవి:
నెట్‌ఫ్లిక్స్:
రేడియోయాక్టివ్ ఎమర్జన్సీ (వెబ్ సిరీస్) – ఈ నెల 18
ప్యూరియస్ సీజన్ 2 (వెబ్ సిరీస్) – ఈ నెల 18
పీకీ బ్లైండర్స్ ది ఇమ్మార్షల్ మ్యాన్ (హాలీవుడ్ సినిమా) – ఈ నెల 20
బోర్డర్ 2 (హిందీ సినిమా) – ఈ నెల 20
ది రైజ్ ఆఫ్ ది రెడ్ హాట్ చిల్లి పెప్పర్స్ (డాక్యుమెంటరీ) – ఈ నెల 20
ఏ డిఫరెంట్ మ్యాన్ (హాలీవుడ్ సినిమా) – ఈ నెల 20
అమెజాన్ ప్రైమ్:
ఇన్విసిబుల్ సీజన్ 2 (వెబ్ సిరీస్) – ఈ నెల 18
ది హౌస్ మెయిడ్ (హాలీవుడ్ సినిమా) – ఈ నెల 19
డెడ్ లాక్ సీజన్ 2 (వెబ్ సిరీస్) – ఈ నెల 20
అమోర్ యానిమల్ (వెబ్ సిరీస్) – ఈ నెల 20
జీ5:
ల్యాండ్ లార్డ్ (డబ్బింగ్ సినిమా) – ఈ నెల 19
కాసర్గడ్ ఎంబసీ (డబ్బింగ్ సినిమా) – ఈ నెల 20
జటాధర (తెలుగు సినిమా) – ఈ నెల 20
జియో హాట్‌స్టార్:
చిరైయా (హిందీ సినిమా) – ఈ నెల 20
యాపిల్ టీవీ:
ఇంపర్ఫెక్ట్ ఉమెన్ (హాలీవుడ్ థ్రిల్లర్) – ఈ నెల 18
సోనీ లివ్:
జజ్ సిటీ (బెంగాలీ సినిమా) – ఈ నెల 19
సన్ నెక్ట్స్:
సీతా పయనం (తెలుగు సినిమా) – ఈ నెల 20












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!