

కెజిఎఫ్ 2 తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యష్, ఇప్పుడు తన తదుపరి సినిమా “టాక్సిక్” తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా, నయనతార కీలక పాత్రలో నటిస్తున్నారు.మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఆ తర్వాత మేకర్స్ సైలెంట్‌గా ఉండటంతో అభిమానులు కొంచెం ఆందోళన చెందుతున్నారు.
ఇకపోతే, షూటింగ్ జాగ్రత్తగా సాగుతుందని, యష్ ఈసారి కూడా కొత్త స్థాయిలో మాస్ ఎంటర్టైనర్ ఇవ్వాలని చూస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. మధ్యలో వచ్చిన నెగిటివ్ రూమర్స్ అన్నీ కేవలం ఊహాగానాలేనని, సినిమా బృందం స్పష్టం చేస్తోంది.
మొదట 2026 ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నా, ఇప్పుడు సమ్మర్‌కు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే సినిమా క్వాలిటీ పరంగా అత్యుత్తమంగా రావాలని యూనిట్ భావిస్తోంది.
కెజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్, “టాక్సిక్” తో మరోసారి గ్యాంగ్‌స్టర్ జానర్‌ను కొత్త రీతిలో చూపించబోతున్నాడు. యాక్షన్ సీన్స్ భారీ స్థాయిలో ఉన్నాయని టాక్. ఇదే సమయంలో యష్ రామాయణం సినిమాలో రావణుడిగా కూడా కనిపించనున్నాడు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!