

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 111 వ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, తాజాగా సినిమాలోని ఓ ప్రత్యేక గీతంపై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఈ పాట కోసం చిత్రబృందం భారీ సెట్‌ను సిద్ధం చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సంగీత దర్శకుడు ఎస్ థమన్ బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ బీట్‌లతో ప్రత్యేక సాంగ్‌ను రూపొందించినట్లు సమాచారం. సెట్స్ నుంచి బయటకు వచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇప్పటికే బాలకృష్ణ, సముద్రఖని మధ్య కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించగా, ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్‌పై మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ‘భగవంత్ కేసరి’ తర్వాత మరోసారి కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన నటించడం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. యాక్షన్, ఎమోషన్, రాజకీయ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ భారీ వ్యయంతో నిర్మిస్తోంది. త్వరలోనే టైటిల్, టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. థమన్ సంగీతం, బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!