

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఆహ్వాన పత్రికతో పాటు పంపిస్తున్న ప్రత్యేక గిఫ్ట్ బాక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి కార్డుతో పాటు అతిథులకు అందిస్తున్న ఈ లగ్జరీ బాక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అందంగా డిజైన్ చేసిన ఈ గిఫ్ట్ హ్యాంపర్ గురించి అభిమానుల్లో భారీగా చర్చ జరుగుతోంది.
ఈ గిఫ్ట్ బాక్స్‌లో విజయ్ దేవరకొండకు చెందిన రౌడీ బ్రాండ్ టీషర్ట్, రష్మిక మందన్న బ్రాండ్‌కు సంబంధించిన ‘నేషనల్ క్రష్’ పర్ఫ్యూమ్ బాటిల్, చేతులు-కాళ్లకు ఉపయోగించే ఆయుర్వేదిక్ క్రీమ్, జీడిపప్పు ప్యాకెట్, స్వీట్ బాక్స్ ఉన్నట్లు సమాచారం. ఈ పెళ్లి కార్డ్ బాక్స్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, దీనికోసం భారీగా ఖర్చు చేసినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ఆహ్వానం కాకుండా ప్రత్యేకంగా గిఫ్ట్ బాక్స్ పంపించి ఈ జంట మరోసారి ప్రత్యేకతను చాటుకుందనే టాక్ వినిపిస్తోంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!