

సూర్య నటించిన ‘వీరభద్రుడు’ (తమిళంలో కరుప్పు) సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, మాస్ ఆడియన్స్ మద్దతుతో తెలుగు, తమిళ భాషల్లో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా ఫలితం సూర్యకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ముఖ్యంగా ఆయన తదుపరి తెలుగు చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై దీని ప్రభావం పాజిటివ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ‘రాకా’ సినిమా కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానుల్లో మాత్రం కొత్త ఆందోళన మొదలైంది.
ఈ సినిమాకు సంగీతం అందించిన సాయి అభ్యంకర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదని, ముఖ్యంగా రెండో భాగంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా గట్టిగా ఉందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సాయి అభ్యంకర్ ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు సంగీత దర్శకుడిగా పరిచయం కానుండటంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయినప్పటికీ అల్లు అర్జున్ మ్యూజిక్ ఎంపికలపై మంచి అవగాహన కలిగిన హీరో కావడంతో చివరికి మంచి ఆల్బమ్ వస్తుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!