

దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు పెరుగుతున్న ఆదరణతో పలువురు నిర్మాతలు సల్మాన్ ఖాన్‌తో భారీ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ కుటుంబ కథా యాక్షన్ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుల జంట రాజ్ అండ్ డీకేతో కలిసి సల్మాన్ ఖాన్‌ను సూపర్ హీరోగా చూపించే భారీ సినిమాకు సిద్ధమవుతోంది.
ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే థియేటర్ అద్దె వివాదాలు కొనసాగుతున్నప్పటికీ సల్మాన్ ఖాన్ ఇరువర్గాలతో కలిసి పని చేయడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇటీవలి కాలంలో సల్మాన్ ఖాన్ సినిమాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో ఈ భారీ ప్రాజెక్టులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ కమర్షియల్ సినిమాల్లో తెలుగు దర్శకులు తమ ప్రత్యేకత చూపించినందున సరైన కథతో సల్మాన్ ఖాన్‌కు మళ్లీ భారీ విజయం అందించగలరని కొందరు భావిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!