

బాలీవుడ్ కథానాయిక సారా అలీఖాన్ పెళ్లి, కెరీర్‌పై తన అభిప్రాయాలను వెల్లడించింది. సరైన సమయానికి జీవితంలోకి రావాల్సిన వ్యక్తి తప్పకుండా వస్తాడని ఆమె తెలిపింది. ‘పతీ పత్ని ఔర్ వో 2’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మన చుట్టూ జరిగే సంఘటనలు, అనుభవాలు మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. అనేక వివాహాలు మధ్యలోనే ముగిసిపోవడం చూసిన కారణంగా తాను పెళ్లి విషయంలో తొందరపడదలుచుకోలేదని చెప్పింది.
పెళ్లి చేసుకున్నప్పుడే జీవితం సంపూర్ణం అవుతుందని తాను నమ్మడం లేదని, వ్యక్తిగత అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని సారా వెల్లడించింది. ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా కెరీర్‌పైనే ఉందని, సరైన వ్యక్తి రావాల్సి ఉంటే ఆయనే వస్తారని చెప్పింది. ఒంటరిగా ఉండటంలో కూడా తాను సంతోషంగా ఉంటానని, జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపడకూడదని అభిప్రాయపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!