

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. సెప్టెంబర్ 23న ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ హైప్ ఏర్పడింది. ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా సుమారు రూ.80–100 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.50 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఆడియో హక్కుల ద్వారా దాదాపు రూ.15 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా నాని కెరీర్‌లోనే అత్యధిక స్థాయిలో జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ.75 కోట్లకు పైగా అమ్ముడవగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.100 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. బయ్యర్లు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని సమాచారం. ఇది గ్రాస్ పరంగా దాదాపు రూ.200 కోట్లుగా ఉండొచ్చు. సినిమాకు ఉన్న హైప్ దృష్ట్యా తొలి రోజే రూ.60 కోట్ల వరకు వసూళ్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హిట్ టాక్ వస్తే తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేరుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!