

గత ఏడాది కొంత సైలెంట్‌గా కనిపించిన సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు వరుస భారీ ప్రాజెక్టులతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తున్నాడు. తాజాగా చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం MEGA158కి సంగీత దర్శకుడిగా థమన్ అధికారికంగా చేరాడు.
వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ విజయానంతరం చిరంజీవి - బాబీ కొల్లి మరోసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, గతంలో కలిసి చార్ట్‌బస్టర్ పాటలు అందించినట్లు గుర్తుచేసుకుంటూ, చిరంజీవి కోసం మరో మ్యూజికల్ బ్లాస్ట్‌కు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఇదే కాకుండా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం, బాలకృష్ణ కొత్త సినిమాలకు కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!