
న్యూస్

కోలీవుడ్ నటుడు సూర్య హీరోగా, టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటిస్తున్నారు. టీజర్‌ను బట్టి చూస్తే, తనకంటే దాదాపు 20 సంవత్సరాలు చిన్న వయసున్న ఒక అమ్మాయి ప్రేమిస్తున్నానంటూ వెంటపడితే, హీరో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే ఆసక్తికరమైన కథతో సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
లవ్, స్పోర్ట్స్, ఎమోషన్ అంశాలను కలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో సూర్య సంజయ్ విశ్వనాథ్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన షూటర్ పాత్రలో నటిస్తున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. టీజర్లో కనిపించిన భావోద్వేగ సన్నివేశాలు, కథలోని కొత్త కోణం ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.



.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!