
ఆరోగ్యం

తెలుగు చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించిన కళాకారులు, సాంకేతిక నిపుణులను సత్కరించేందుకు నిర్వహించిన “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026” హైదరాబాద్లోని ఏఏఏ సినిమాస్, అమీర్పేట్లో ఘనంగా జరిగింది. సినీ, సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై వేడుకను విజయవంతం చేశారు.
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మారకార్థం నిర్వహించిన ఈ అవార్డుల వేడుకలో వివిధ విభాగాల్లో ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రదానం చేశారు. ఏపీఫ్డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్, నిర్మాత చడలవాడ శ్రీనివాస్ రావు, నందమూరి మోహన కృష్ణ, టీఎఫ్పీసీ కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, నిర్మాత పుష్కూర్ రామ్ మోహన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆది సాయికుమార్, ప్రియదర్శి, శివాని నాగారం, రాహుల్ రవీంద్రన్ తదితరులు అవార్డులు అందుకున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!