

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ బాక్సాఫీస్ వద్ద మంచి ఆరంభాన్ని అందుకున్నట్లు సమాచారం. డీసెంట్ బజ్‌తో థియేటర్లలో విడుదలైన ఈ ఎంటర్‌టైనర్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.4.15 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్‌లో మరో మంచి ఓపెనింగ్‌గా నిలిచింది. తొలి రోజు వసూళ్లతో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
రెండో రోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నట్లు సమాచారం. శ్రీవిష్ణు గత చిత్రం ‘సింగిల్’ తరహాలోనే ‘కామ్రేడ్ కళ్యాణ్’ కూడా మంచి ఓపెనింగ్స్ సాధించడం విశేషం. ఈ చిత్రంలో మహిమా నంబియార్ కథానాయికగా నటించగా, జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు. వెంకట కృష్ణ కర్ణాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. రానున్న రోజుల్లో సినిమా వసూళ్లు ఎలా కొనసాగుతాయనేది ఆసక్తికరంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!