

ఓజి × మసక మసక సాంగ్ అందరినీ అలరిస్తుందని, తన జీవితంలో 2026 మొత్తం మ్యూజిక్కే అంకితం అవుతుందని పాప్ సింగర్ స్మిత తెలిపారు. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా లైవ్ షోలు నిర్వహించనున్నట్లు సాంగ్ లాంచ్ ఈవెంట్లో వెల్లడించారు.
క్వీన్ ఆఫ్ పాప్గా గుర్తింపు పొందిన స్మిత తాజా సాంగ్ ఓజి × మసక మసక ఘనంగా విడుదలైంది. స్మిత, నోయల్ నటించిన ఈ పాటకు విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. జార్జ్ సి. విలియమ్స్ విజువల్స్ అందించగా, నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అడెలె ఈ పాటకు ఎడిటింగ్ అందించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు దేవా కట్టా హాజరయ్యారు.
సాంగ్ లాంచ్ సందర్భంగా స్మిత మాట్లాడుతూ, తన తండ్రి ఆలోచనతో తన మ్యూజిక్ ప్రయాణం మొదలైందని తెలిపారు. తల్లి తన తొలి పెట్టుబడిని తనపై పెట్టి ప్రోత్సహించిందన్నారు. హాయ్ రబ్బా ఆల్బమ్ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన తర్వాత అదే తన గుర్తింపుగా మారిందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ‘ఓజి’ పేరుతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
నార్త్ ఇండియాలో ఇండిపెండెంట్ మ్యూజిక్ బాగా ఆదరణ పొందుతుందని, సౌత్‌లో మాత్రం మధ్యలో ఆగిపోయిందని తెలిపారు. మళ్లీ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నానని, సంక్రాంతికి ఒక పండగలా ఉండే పాట విడుదల కానుందని చెప్పారు. మార్చి చివరి నుంచి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌తో పాటు యూఎస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్‌లో లైవ్ షోలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!