

ఊరమాస్ పాటలతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొంది, ‘నాటు నాటు’ (RRR) పాటతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈరోజు అధికారికంగా ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాదు ఓల్డ్ సిటీ నుంచి ఆస్కార్ వేదిక వరకు వెళ్లిన అతని ప్రయాణం ఎంత అద్భుతమో తెలిసిందే.
ఈ తెల్లవారుజామున హైదరాబాద్లో జరిగిన సంప్రదాయ వేడుకలో, రాహుల్ తన ప్రియురాలు హరిణ్య రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి సాంప్రదాయ శైలిలో ఆనందపూర్వకంగా జరిగింది.
ఈ శుభ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరై నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. సోషల్ మీడియాలో కూడా రాహుల్కు శుభాకాంక్షల సందడి కొనసాగుతోంది. తన సంగీత ప్రయాణంతో అందరిని అలరించిన రాహుల్, ఇప్పుడు వ్యక్తిగతంగా కొత్త జీవితం ప్రారంభించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

.jpeg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!