

ప్రముఖ సింగర్ చిన్మయి ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 40 మంది ఎంపీలు ప్రస్తుతం అత్యాచార కేసులను ఎదుర్కొంటున్న కారణంగా అత్యాచారానికి మరణశిక్ష విధించే బిల్లు ఆమోదం పొందలేదని పేర్కొన్న వీడియో క్లిప్‌ను ఆమె షేర్ చేశారు. ఆ పోస్ట్‌కు చిన్మయి ‘దండం’ ఎమోజీలను జోడించడం గమనార్హం. ఈ పోస్ట్ సామాజిక, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ పోస్ట్‌కు నటి అనసూయ తనదైన శైలిలో స్పందించారు. “ఇదే మన భారతదేశం.. మనం ఎన్నుకున్న నేతలు నడిపే భారతదేశం. చాలా దూరం కదా దారి.. మనం బట్టల దగ్గరే ఆగిపోయాం” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అంశంపై మరింత పెద్ద చర్చ జరుగుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చిన్మయికి మద్దతుగా అనసూయ నిలిచిందని కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేయగా, మరికొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!