

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్‌కు సంక్రాంతి సమయంలో విడుదలయ్యే సినిమాలు మంచి సక్సెస్ ఇస్తున్నాయి. ఆయన సినిమాలు పండుగ సమయంలో విడుదలైతే మంచి హిట్ అవుతున్నాయి. 2016లో సంక్రాంతికి వచ్చిన 'ఎక్స్ ప్రెస్ రాజా' హిట్ కాగా, 2017లో వచ్చిన ‘శతమానం భవతి’ బ్లాక్ బస్టర్ అయ్యింది. తాజాగా వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా మంచి స్పందన పొందింది. ఈ కారణంగా సంక్రాంతి పండుగ శర్వానంద్‌కు ఒక సెంటిమెంట్‌గా మారింది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్’ వచ్చే నెల 3 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ఆయన బైక్ రేసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా దేశం మొత్తం మాట్లాడుకునేలా ఉంటుందని శర్వానంద్ నమ్మకంగా చెబుతున్నారు. తన గత సినిమాకు ముందే హిట్ అవుతుందని చెప్పినట్లే, ఇప్పుడు “బైకర్” కూడా బంపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన విశ్వాసంగా చెబుతున్నారు.
ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే, శర్వానంద్‌కు యువీ ప్రొడక్షన్స్ సంస్థతో ఉన్న సెంటిమెంట్. ఈ బ్యానర్లో ఆయన చేసిన రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు “బైకర్” ఈ బ్యానర్‌తో ఆయన చేస్తున్న నాలుగో సినిమా. ఈ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయితే, శర్వానంద్ ఖాతాలో మరో పెద్ద హిట్ పడే అవకాశముంది.








.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!