27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత

Writer: Shivani K 10:33 AM, 27 ఆగస్టు, 2026
సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత

ప్రముఖ నటుడు జేవీ నారాయణరావు మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల సినీ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1953లో జన్మించిన నారాయణరావు గుంతకల్లు, హైదరాబాద్‌లో బాల్యం, విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. నటనపై ఆసక్తితో నాటకాల్లోనూ పాల్గొన్న ఆయన, 1973లో మద్రాసు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఫిలిం ఇన్‌స్టిట్యూట్ తొలి బ్యాచ్‌లో శిక్షణ పొందారు. అదే బ్యాచ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఉండటంతో ఇద్దరి మధ్య అప్పుడే స్నేహం ఏర్పడింది. 1976లో కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతులేని కథ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన నారాయణరావు, తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. అనంతరం ‘ఒక ఊరి కథ’, ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’ వంటి చిత్రాల్లో హీరోగా నటించారు.

హీరోగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో నారాయణరావు సహాయ, సహాయక పాత్రల్లో కొనసాగారు. తన సినీ ప్రయాణంలో సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించడంతో పాటు టెలివిజన్ సీరియళ్లలోనూ కనిపించారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు సన్నిహిత అనుబంధం ఉండేది. ‘చట్టానికి కళ్లులేవు’, ‘మంచు పల్లకి’, ‘రాజా విక్రమార్క’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ తదితర చిత్రాల్లో చిరంజీవితో కలిసి నటించారు. అంతేకాకుండా చిరంజీవి హీరోగా ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ చిత్రాలను నిర్మించారు. అనంతరం ‘యముడికి మొగుడు’ చిత్రాన్ని తమిళంలో రజనీకాంత్‌తో రీమేక్ చేశారు. చిరంజీవి, రజనీకాంత్‌లతో తనకున్న స్నేహం, అనుబంధం గురించి నారాయణరావు పలు సందర్భాల్లో వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
జేవీ నారాయణరావునారాయణరావుతెలుగు సినిమాసినీ పరిశ్రమచిరంజీవిరజనీకాంత్కె బాలచందర్నంది అవార్డుతెలుగు నటుడుసినీ సంతాపం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని పిటిషన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ
జనరల్

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని పిటిషన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు
జనరల్

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం.. వైరల్ వీడియోపై క్లారిటీ
సినిమాలు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం.. వైరల్ వీడియోపై క్లారిటీ

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు
సినిమాలు

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్
జనరల్

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..
జనరల్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి
రాజకీయాలు

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక
క్రీడలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం
జనరల్

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!