

జూబ్లీహిల్స్‌లోని ఓ షోరూం ప్రారంభానికి హాజరైన సమంత రూత్ ప్రభుకు చేదు అనుభవం ఎదురైంది. పెళ్లి తర్వాత తెలంగాణలో ఆమె పాల్గొన్న తొలి కార్యక్రమం ఇదే. షోరూం ప్రారంభ కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా, ఆమెను భారీగా జనాలు చుట్టుముట్టారు. అధిక జనాభా కారణంగా అదుపు తప్పిన పరిస్థితుల్లో కొందరు కింద పడిన దృశ్యాలు కూడా వీడియోల్లో కనిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ గందరగోళంలో కొందరు ఆకతాయిలు సమంత చీర కొంగును లాగినట్లు వీడియోల్లో కనిపించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయినప్పటికీ, సమంత ఎంతో ఓర్పుతో పరిస్థితిని ఎదుర్కొని, జనాల మధ్య నుంచి బయటపడి కారులోకి చేరుకుంది. ఈ ఘటనపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ప్రవర్తన ఎందుకు జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత, ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించారు. తన సొంత బ్యానర్లో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తూ, షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇదే తరహా ఘటన ఇటీవల కూకట్పల్లి లూలూ మాల్లో ది రాజా సాబ్ లాంచ్ అనంతరం నిధి అగర్వాల్ కు ఎదురవడం గమనార్హం. ఇలాంటి సంఘటనలు సెలబ్రిటీల భద్రతపై ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!