
రాజకీయాలు

మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి రష్మిక మందన్న ‘మైసా’ చిత్రంలో ఇప్పటివరకు చూడని మాస్ లుక్‌లో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ దశలో వేగంగా ముందుకు సాగుతోంది.
ఇప్పటికే చిత్రీకరణలో ఎక్కువ భాగం పూర్తయినట్లు సమాచారం. దీంతో టీజర్ విడుదలకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 15న టీజర్ విడుదల చేసే అవకాశముంది. అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా, టీజర్ ఆకట్టుకుంటే మరింత హైప్ పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!