
రాజకీయాలు

పీరియాడిక్ కథలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న రావు బహదూర్ జూన్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో సత్యదేవ్ కంచరానా హీరోగా నటిస్తుండగా, పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. సత్యదేవ్ ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
అయితే జూన్ 4న విడుదల కానున్న టాక్సిక్ కూడా భారీ అంచనాలతో రాబోతుంది. ఒకరోజు గ్యాప్‌తో విడుదలకు రావడం మేకర్స్ ధైర్యాన్ని సూచిస్తోంది. గతంలో కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వంటి ప్రశంసలు పొందిన చిత్రాలను అందించిన వెంకటేష్ మహా ఈ ప్రాజెక్ట్‌పై కూడా అదే నమ్మకంతో ఉన్నారు. పోటీ ఉన్నప్పటికీ మంచి కంటెంట్ ఉంటే విజయం ఖాయం అన్న నమ్మకంతో ‘రావు బహదూర్’ బరిలోకి దిగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!