
జనరల్

పెద్ది ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టిస్తోంది. యూట్యూబ్‌లో 63 మిలియన్‌కు పైగా రియల్‌టైమ్ వ్యూస్ సాధించిన ఈ ట్రైలర్, మూవీ ట్రెండింగ్ చార్ట్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. రామ్ చరణ్ మాస్, రగ్గడ్ అవతార్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, ట్రైలర్లో కనిపించిన ఎనర్జీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. తాజాగా విడుదలైన పోస్టర్లో రామ్ చరణ్ సైకిల్‌పై వీధిలో దూసుకెళ్తున్న తీరు సినిమాకు ఉన్న మట్టి వాసన, సహజత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ట్రైలర్‌కు వస్తున్న అద్భుత స్పందనతో జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!