
జనరల్

పెద్ది విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్లో సంచలన రికార్డు సృష్టించింది. ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్ $100K మార్క్‌ను దాటడంతో ఆ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుత స్పందనతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్స్ రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 3న గ్రాండ్ ప్రీమియర్స్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్, సినిమాపై పెరిగిన అంచనాల వల్లే ఈ స్థాయి రికార్డు సాధ్యమైందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!