
క్రీడలు

సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం జైలర్‌కి కొనసాగింపుగా జైలర్ 2 రూపొందుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు కలిగిస్తోంది.
వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రెండు విడుదల తేదీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తిక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనుండడం సినిమాకు మరింత ఆకర్షణగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!